కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వేగంగా పుంజుకుందని కర్ణాటక మంత్రి దినేశ్ గుండురావు అన్నారు. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, అన్నింటా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను బీజేపీ కోరుకుందని… కానీ కాంగ్రెస్ ఏమిటో వివిధ రాష్ట్రాలలో గెలిచి చూపించామన్నారు. తెలంగాణలో తాము బీఆర్ఎస్‌ను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుందన్నారు. అభివృద్ధి నినాదం మీద ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందన్నారు. తెలంగాణ మిగులు నిధులతో ఆర్థికంగా బలమైన రాష్ట్రమని… కానీ ఆ తర్వాత జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను 3 నెలల్లోనే అమలు చేశామన్నారు.

Previous articleరాజయ్య, కడియం శ్రీహరి గురించి మనం చెప్పాల్సిన పని లేదు.. వారే ఒకరికొకరు చెప్పుకున్నారన్న రేవంత్ రెడ్డి
Next articleవివేక్ కంపెనీకి రూ.8 కోట్ల నగదు బదలీ జరిగిందంటూ ఎన్నికల సంఘానికి బాల్క సుమన్ ఫిర్యాదు