శేరిలింగంపల్లి పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న నిరుపేద రెడ్డి ఆటో డ్రైవర్ కరుణాకర్ రెడ్డి కుమారునికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో విఎన్ఆర్ విజ్ణాణ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ సీటు వచ్చింది
అయితే 22-7-2023 వరకు మొదటి సంవత్సరం ఫీజు దాదాపు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెల్లించాలి, కానీ ఫీజు కట్టడానికి సరిపోను డబ్బులు లేనందున మన రెడ్డి సంక్షేమ సంఘం శేరిలింగంపల్లిని సంప్రదించగా ఆవిద్యార్థి ఉన్నత విద్యకు అవసరమైన తోడ్పాటు డబ్బులు సంఘం అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు మరియు గౌరవ సలహాదారులు గంట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో, కమిటీ నాయకుల సమక్షంలో వారికి అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, కొండవీటి ప్రభాకర్ రెడ్డి, తాడూరు గోవర్ధన్ రెడ్డి,శేరి అంతిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,దుగ్గి రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, తుక్కాని నర్సింహారెడ్డి, విద్యార్థి నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి,సాహిత్ రెడ్డి పాల్గొన్నారు.

Previous articleఇప్పుడు మరో అంశంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం!
Next articleమేము సంస్కారం తప్పితే జగన్ తట్టుకోలేరు..