గుంటూరు జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను చూస్తే ముఖ్యమంత్రి జగన్ భయంతో వణికి పోతున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు అన్నారు. నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి లో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన గాదె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ఆర్ధిక మంత్రి ఎక్కడ కనిపించ కుండా పోయారని, అప్పులు తేవడానికే ఆర్దిక మంత్రి పనిగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు అవుతోందని విమర్శించారు. పేరు తలుచుకోవడానికి భయపడి పవన్‌ని దత్త పుత్రుడని అంటున్నారన్నారు. తాము సంస్కారం తప్పితే జగన్ తట్టుకోలేరని అన్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబంలో పెళ్ళిళ్ళు జరగకుండా కాపురాలు చేస్తున్నారని.. అది చూసుకోండని గాదె వెంకటేశ్వర రావు అన్నారు. సీఎం కాకముందు 30 కేసులు ఉన్న చరిత్ర జగన్‌దని… తాజాగా ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక అమ్ముకుంటున్న చరిత్ర మీదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాజధాని లేని ముఖ్యమంత్రివని ఎద్దేవా చేశారు. సంస్కారం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని గాదె వెంకటేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.