టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఘాట్ వద్ద నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.