గత ప్రబుత్వంలో ఎవరో అన్నారు .. ఆయన అసలు గెలవడని.. కానీ పవన్ కళ్యాణ్ అన్నవారి కళ్ళు బైర్లు కమ్మేలా అఖండ విజయం సాధించారు. ఇంకెవరో ఛాలెంజ్ చేశారు . పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని.. అదే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి అన్నవారి పేరు మార్చుకునేలా చేశాడు. వేరేవరో అన్నారు..పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడని.. కానీ తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిపించుకుని , ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల సింహం పవన్ కళ్యాణ్ ఏపీ సెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఎంతో విశేష స్పందన లభించింది.. ఆయన గెలుపుతోనే ఆనందంతో తడిసి ముద్దైన ఆయన అభిమానుల , జనసైనికుల కళ్ళు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున మరో సారి సంతోషంతో చెమ్మగిల్లాయి. ఇప్పుడు కొన్ని కోట్లమంది ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది .. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతాడా అని ఎదురు చుసిన ఎందరి కోరికో నెరవేరనుంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నాడు .. ఎవరైతే తనపై విమర్శలు చేశారో అందరికీ సమాధానం చెప్పబోతున్నాడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించబోతున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. దానికి శుభ ముహూర్తం ఈ నెల 17 న ఖాయమైంది. 17 వ తారీకు నుండి నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు అందరు ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం స్పీకర్ ని ఎన్నుకుంటారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉపసంహరణ ఉందనున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పైనే ఉంది. ఏపీ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించి , మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలిచి , డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు శాఖల్ని తీసుకుని అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్ మాటలు వినటం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆనాడు వైసీపీ చేసిన అవమాన భారంతో అసెంబ్లీ నుండి చంద్రబాబు వెళ్ళిపోయాడు .. వెళ్ళిపోతూ మళ్ళి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశాడు .. ఆయన చెప్పినట్టుగానే క ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాకే అదే అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టబోతున్నాడు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా , కేసులు పెట్టినా ఎక్కడా అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో కూటమితో జతకట్టి టీడీపీ ని విజయాపథం వైపు నడిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు చంద్రబాబు .. ఈ విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందంటూ స్వయంగా చంద్రబాబే చెప్పారు ఏది ఏమైనా ఈ నెల 17 ఏపీ అసెంబ్లీ కొత్త ప్రభుత్వంతో కళకళలాడనుంది