ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురందేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని… ఒక ప్రభంజనం అని చెప్పారు.