చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ అందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఈ మేరకు వివేక్‌పై ఈసీ ప్రతినిధి అబ్ జర్వర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివేక్‌పై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్‌కు చెందిన కంపెనీ విజిలెన్స్‌కు రూ.8 కోట్ల నగదు బదిలీ అయిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందరినీ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ నగదు హైదరాబాద్ నుంచి రామగుండంకు బదిలీ అయిందన్నారు. వివేక్‌కు సంబంధించిన అన్ని సంస్థలు, కంపెనీలపై నిఘా పెట్టాలని తాము ఈసీని కోరామన్నారు. తన కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంక్, రైస్ మిల్లులకు, మార్కెట్ వాళ్లకు ఆ డబ్బులను వివేక్ పంపిస్తున్నారన్నారు.