వారిది ఒకే కుటుంబం .. ఆ కుటుంబంలో 1200 మందికి పైగా సభ్యులు.. 350 మంది ఓటర్లు .. అసలే ఎన్నికలు ..350 మంది ఓటర్లు ఒకే కుటుంబంలో ఉన్నారంటే రాజకీయ నేతలు ఊరుకుంటారా ..? ఇప్పుడు వారింటికి క్యూ కడుతుండటంతో ఆ కుటుంబం వార్తల్లో కెక్కింది. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే అస్సాం రాష్ట్రంలోని సోనిట్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో దివంగత రోన్ బహదూర్ తాపాకు ఐదుగురు భార్యలు. వారి ద్వారా ఆయనకు 12 మంది మగపిల్లలు, 9 మంది ఆడపిల్లలు సంతానం కలిగారు. వారందరికీ కూడా పెళ్లిళ్లై పిల్లలు కలగడంతో మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ఏకంగా 1200లకు పైగా చేరింది. ఆ కుటుంబంలో ప్రస్తుతం 350 మందికి ఓటు హక్కు ఉందట . రాబోయే ఎన్నికల్లో వారందరూ ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారట. ఇది తెలిసిన రాజకీయ నేతలు ప్రస్తుతం వారి ఇంటికి క్యూ కడుతున్నారట . అసోంలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న కుటుంబాల్లో తాపా కుటుంబం ఒకటిగా నిలిచింది . ఇక రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఏది ఏమైనా ఒకే కుటుంబంలో 1200 మందికి పైగా సభ్యులు, 350 మందికి పైగా ఓటర్లు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.