Home Cinema విజయ్ దేవరకొండ  సినిమా షురూ!

విజయ్ దేవరకొండ  సినిమా షురూ!

రౌడీ బాయ్ ‘ది’ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.’దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను కథానాయిక ఎంపిక చేశారు. ‘సీతా రామం’లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను  ఫిదా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో అవకాశం అందుకున్నారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. పూజా కార్యక్రమాల్లో ఆమె కూడా పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు కూడా పాల్గొన్నారు. 

Previous articleసత్యదేవుడి ఆలయంలో పవన్‌ కళ్యాణ్
Next articleమహేశ్​ మరదలి పాత్రలో శ్రీలీల