శ్రియారెడ్డి OG సినిమా గురించి మాట్లాడుతూ.. సుజిత్ వచ్చి కథ చెప్తా అన్నప్పుడు కమర్షియల్ సినిమా అయి ఉంటింది, కథ విని నో చెపుదాం అనుకున్నాను. కానీ కథ విన్నాక మొదటి 10 నిమిషాలకే నాకు బాగా నచ్చింది. అందుకే OG సినిమాకి ఓకే చెప్పాను. పవన్ గారిని సెట్ లో మొదటి రోజు చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను. పవన్ గారు చాలా అందంగా ఉంటారు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. అలా షేక్ హ్యాండ్ ఉంచేశాను. చాలా హంబుల్ గా ఉంటారు. సినిమా మాత్రం అదిరిపోతుంది అని తెలిపింది.ఇక పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. నేను ఏపీ పాలిటిక్స్ కూడా ఫాలో అవుతాను. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు బాగుంటాయి, ఫుల్ మాస్ గా, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. బయట ఆ రేంజ్ లో మాట్లాడే పవన్ కళ్యాణ్ సెట్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారు. ఏపీ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడాను. పవన్ గారు సీఎం అవుతారా లేదా నేను చెప్పను కానీ అయితే మాత్రం ఆయనది చాలా మంచి మనుసు. ఆయన ప్రజలకు బాగా కనెక్ట్ అవుతారు అని తెలిపింది. దీంతో శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.