Home Breaking News ఇడుపులపాయకు ప్రియాంక..! కాంగ్రెస్ లోకి షర్మిల..! ఏపీ తెలంగాణలో ఫోకస్..

ఇడుపులపాయకు ప్రియాంక..! కాంగ్రెస్ లోకి షర్మిల..! ఏపీ తెలంగాణలో ఫోకస్..

ఏపీలో షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఢిల్లీలో రాహుల్, ప్రియాంక తో సమావేశం సమయంలో షర్మిల ఏపీకి సంబంధించి తన నిర్ణయం వెల్లడించనన్నట్లు తెలుస్తోంది. జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు నివాళి అర్పించేందుకు ఇడుపులపాయకు ప్రియాంక గాంధీ రానున్నట్లు సమాచారం. అక్కడే షర్మిల…వైఎస్సార్ ఘాట్ లోనే షర్మిల కాంగ్రెస్ తో తన భవిష్యత్ ప్రయాణం గురించి షర్మిల కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్ర విభజనతో ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్..తిరిగి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ తో సయోధ్యకు సిద్దమయ్యారు. రాజన్న రాజ్యం పేరుతో స్థాపించిన పార్టీ అనుకున్న మేర సక్సస్ కాకపోవటంతో పొత్తు లేదా విలీనం దిశగా కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించారు. ఇడుపులపాయ కేంద్రంగా కీలక అడుగులకు రంగం సిద్దం అవుతోంది.వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దమయ్యారు. రాజన్న రాజ్యం తన లక్ష్యమంటూ షర్మిల స్థాపించిన వైఎస్సార్టీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తోంది.
వైఎస్సార్ ఇమేజ్ ను ఇంత కాలం వదులుకున్న కాంగ్రెస్ తిరిగి రెండు రాష్ట్రాల్లో ఓన్ చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా అన్న వద్దని చెప్పినా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలతో మంతనాలు ప్రారంభించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చక్రం తిప్పారు. నేరుగా ప్రియాంక ద్వారా షర్మిలతో మాట్లాడించారు.

పార్టీని విలీనం చేయాలని తెలంగాణలో గుర్తింపుతో పాటుగా ఏపీలో కీలక బాధ్యతలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.సోనియాతో షర్మిల సమావేశం:తొలుత షర్మిల విలీనం ప్రతిపాదనకు అంగీకరించలేదు. కానీ, తెలంగాణలో పార్టీ మనుగడ గురించి తన సన్నిహితులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ ఆపర్ ను అంగీకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెండు రాష్ట్రాల్లొనూ ప్రాధాన్యత ఇచ్చేలా షర్మిలకు హామీ ఇవ్వటంతో ఏం చేయాలనే అంశం పైన షర్మిల తర్జన భర్జన పడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కేసీ వేణుగోపాల్ షర్మిలో మాట్లాడారు. సోనియా గాంధీ కూడా షర్మిలతో మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోసం పని చేయాలని కోరుతారని చెప్పినట్లు సమాచారం.

ఒకటి రెండు రోజుల్లోనే షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.షర్మిల ద్వారా కాంగ్రెస్ అసలు లక్ష్యం ఏపీ సీఎం జగన్. తమతో ఢీ అంటే ఢీ కొట్టి ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ పైన ఇప్పుడు కాంగ్రెస్ గురి పెట్టింది. అందుకు షర్మిలను తమ బాణంగా జగన్ పైన ఎక్కు పెట్టేందుకు సిద్దమైంది.