pawan kalyan janasena
pawan kalyan janasena

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గొడవ మధ్యలో కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం జోక్యం చేసుకుని పవన్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. పవన్‌ వీధి రౌడిలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ వివాదంలోకి ప్రముఖ నిర్మాత నట్టికుమార్‌ కూడా చేరారు. పవన్ కల్యాణ్‌ వర్సెస్‌ ద్వారంపూడి మధ్య జరిగిన మాటల వార్ పై స్పందించిన ఆయన ‘ జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్‌ జనసేన తన వెర్షన్‌ వినిపించారు. అయితే ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర శేఖర్ కాకినాడ లో ఒక జెండా కూడా కట్టానీయను అన్నారు. ఇది ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనం. పవన్‌ను కాకినాడ లో అడుగుపెట్టనీయను అనడం చాలా తప్పు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించాలి. ఇక ఇక్కడ ముద్ర గడ పద్మ నాభం ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్‌ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాపు ఉద్యమ నేత పవన్ కల్యాణ్‌ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు’ చెప్పుకొచ్చారు.కాగా పవన్‌ కల్యాణ్‌ ఎంచుకున్న మార్గం సరైనదని, అందరూ ఆయనకు సపోర్ట్‌ చేయాలని నట్టికుమార్‌ పిలుపునిచ్చారు. ‘పవన్ కల్యాణ్‌ వెళ్తున్న రూట్ కరెక్ట్. ఆయన సీఎం అవుతాడు. అందరం ఆయనకు సపోర్ట్‌ చేయాలి’ అని నట్టికుమార్‌ తెలిపారు. కాగా గతంలో రెమ్యునరేషన్‌ విషయంలో పవన్‌పై కోట శ్రీనివాసరావు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా కోటపై నట్టికుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.