జనసేన అధినేత పవన్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య వరుస లేఖల ద్వారా పలు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్ని సీట్లు అడగాలి, సీఎం సీటు షేరింగ్ కూడా ఉండాలంటూ ఆయన తన లేఖల్లో సూచనలు చేశారు. అయితే, ఆయన లేఖలకు పవన్ ఏనాడూ స్పందించలేదు. ఆయన సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు జోగయ్య బహిరంగ లేఖ రాశారు.

తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని… అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.