మూడో విడత వారాహి విజయ యాత్రపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం సమీక్షించారు. వివిధ కమిటీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ… మహిళల అక్రమ రవాణాపై తాను మాట్లాడితే పోలీసులు ప్రశ్నించారని, కానీ ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో గణాంకాలతో సహా వివరించిందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన విమర్శలు, ఆరోపణలు పెందుర్తిలో రుజువయ్యాయన్నారు. అక్కడ వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. కాగా, ఈ నెల 10వ తేదీ నుండి వారాహి మూడో విడత విజయయాత్ర ప్రారంభం కానుంది.