విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇవాళ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాతిపదికగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన తెలిపారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇవాళ మోదీ సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. మేం ఇప్పటికే ఏపీలో సూపర్-6 పేరుతో మేనిఫెస్టో తీసుకువచ్చాం… మిత్రుడు పవన్ కల్యాణ్ 6 కాదు సార్ 10 ఇద్దాం అని అన్నాడు… నేను ఓకే అన్నాను… ఇప్పుడు మేమిచ్చే పథకాలు, కేంద్రం ఇచ్చే పథకాలు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు.