ఆయనొక ప్రభంజనం.. ఆయనొక సంచలనం.. అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాడే కొత్త శకం సృష్టిస్తానని చెప్పాడు.. ఇప్పుడు అందుకు పిఠాపురం వేదికగా అడుగులు మరింత వేగంగా వేస్తున్నాడు.. ప్రచారంలో ప్రజల నీరజనాలతో గెలుపు దిశగా పయనిస్తున్నాడు.. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అతడికి అక్కడి ప్రజల మద్దతు చూసి ప్రతి పక్షంలో గుబులు పుట్టింది.. ఎంతలా అంటే ఇప్పటికే టికెట్ ఇచ్చి కంఫర్మ్ చేసిన తమ అభ్యర్థిని మార్చేంతలా.. అదీ పవన్ కళ్యాణ్ సత్తా అంటే.. అదీ పవన్ కళ్యాణ్ పవర్ అంటే.. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఎమ్మెల్యే గా పవన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. వైసీపీ నుండి వంగా గీతా ఆయనకు పోటీగా బరిలో ఉన్నారు.. అయితే పవన్ ప్రచారంలో భాగంగా పిఠాపురం ప్రజలు అడుగడుగునా బ్రహ్మ రథం పడుతున్నారు.. అక్కడ ఎవరి నోట విన్నా పవన్ కళ్యాణ్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.. దీంతో వైసీపీ పార్టీ తమ అభ్యర్థి విషయంలో పునరాలోచనలో పడింది. వైసీపీ ఊబయ గోదావరి జిల్లాల ఇంచార్జ్ మిథున్ రెడ్డి ని అక్కడి పరిస్థితిని సమీక్షించి తమ పార్టీ అభ్యర్థి వంగా గీతా ను గెలిపించాలని వైసీపీ రంగంలోకి దింపింది.. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజల నాడిని పసిగట్టిన మిథున్ రెడ్డి అధిష్టానానికి అసలు విషయం తెలియజేశాడు.. పిఠాపురంలో పవన్ ప్రభంజనం కొనసాగుతుందని తెలుసుకున్న అధిష్టానం పలువురి నేతలతో మంతనాలు జరిపింది.. చివరికి పవన్ కళ్యాణ్ ని ఎదిరించాలంటే బలమైన ప్రత్యర్థి కావాలనే నిర్ణయానికి వచ్చింది.. పిఠాపురం నుండి సినియర్ నేత ముద్రగడ పద్మనాభం ని బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పటికే వైసీపీ కన్ఫర్మ్ చేసిన వంగా గీతా ప్రచారం కొనసాగిస్తున్నారు.. కానీ తమ అభ్యర్థిని మార్చాలన్న, ఉంచాలన్నా చివరి నిమిషం వరకు అధిష్టానం చేతిలోనే ఉంటుంది..పిఠాపురం మూడు రోజుల పర్యటనలో పవన్ అక్కడి ప్రజలకు మరింత చేరువయ్యారు.. ఆయన గెలుపు పై భరోసా కలిగేలా చేశారు.. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తమ అభ్యర్థిని మారుస్తుందా.. లేదా అన్నది అతి త్వరలో తెలుస్తుంది.. వైసీపీ పార్టీ అభ్యర్థిని మార్చినా, అందరూ కలిసి వచ్చినా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ గెలుపు ఆపేనా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..