గత రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి సమీపంలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పలు సందేహాలు లేవనెత్తారు. ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. 

పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ కాలుపై పడి కాలికి సైతం గాయం అయిందట… మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు అని నిలదీశారు. సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజి కట్టి  ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆనం ప్రదర్శించారు. సీఎం జగన్ నిన్నటి ఘటనలో అద్భుతంగా నటించారు అని వ్యంగ్యం ప్రదర్శించారు.