సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం శుభ పరిణామం అని అభివర్ణించారు. కొణతాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.  కొణతాల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడు అని వివరించారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు.