జనసేనాని పవన్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో చేరుకున్నారు. పవన్ రేపు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, దేశ ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోందని తెలిపారు. 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటుండడం చాలా సంతోషం కలిగిస్తోందని వివరించారు.