Home Breaking News వారాహి యాత్ర #Varahiyatra

వారాహి యాత్ర #Varahiyatra

ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల నుంచి వారాహియాత్ర ప్రారంభం కానుంది. జనసేన పార్టీ వ్యవ్హరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర ప్రగటించారు.  ఈ ప్రకటన తర్వాత పవన్ టూర్ గోదావరి జిల్లాల నుంచే ఎందుకు ప్రారంభమవుతోంది ?  అలాగే ఈ టూర్ నిరంతరాయంగా కొనసాగుతుందా ?  దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారు ? పవన్ తిరిగి షూటింగ్స్ కు వెళ్లిపోతారా ? ఇలాంటి ప్రశ్నలు యెన్నోతలెత్తుతున్నాయి. వీటిపై జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించడం ఎందుకన్న ప్రశ్నను అధికార వైసీపీ నేతలు సంధిస్తున్నారు. దీంతో జనసేన నేతలు దీనిపై స్పందించారు. జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకే పవన్ ఈ టూర్ ను తమకు కచ్చితంగా అండగా నిలుస్తాయని భావిస్తున్న గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత క్రమంగా మిగతా జిల్లాల్లోనూ టూర్ కొనసాగనుంది.

 మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు నిధులు ఎవరు సమకూర్చుస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ ద్వారా వచ్చే డబ్బులతోనే ఈ యాత్ర చేపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు చేస్తున్న సాయంతో ఈ యాత్ర కొనసాగనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. దీంతో వారాహి యాత్ర పూర్తిగా పవన్, జనసైనికుల సాయంతోనే కొనసాగనుందని తేలిపోయింది.