అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు పవన్ చర్చించారు. చర్చల అనంతరం బుద్దప్రసాద్ అభ్యర్థిత్వానికి పవన్ ఆమోదం తెలిపారు. 

పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని జనసేన నేత హరిప్రసాద్ తెలిపారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై పవన్ పార్టీ నాయకులతో చర్చిస్తూ, అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. రైల్వేకోడూరు అభ్యర్థిగా యనమల భాస్కరరావు పేరును పవన్ ప్రకటించారని… అయితే, ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత లేదని… మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారని… కొన్ని గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.