టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారని… దీనికి సంబంధించిన పక్కా సమాచారం తమ వద్ద ఉందని ఆయన ఆరోపించారు. ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. చంద్రబాబుపై మోదీకి శత్రుత్వం ఉందని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఏపీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా కల్లబొల్లి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని… కానీ, ఇంత వరకు కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని… ఇది బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు.