ప్రజాగళం సభలో జనసేనాని పవన్ ప్రసంగిస్తుండగా, మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నారు. పవన్ మాట్లాడుతుండగా… పవన్ అంటూ మోదీ ఒక్కసారిగా పైకి లేవడంతో ఏం జరిగిందోనని అందరూ సైలెంట్ అయిపోయారు.

సభా ప్రాంగణంలో లైట్ టవర్లపైకి వివిధ పార్టీల కార్యకర్తలు ఎక్కడాన్ని గమనించిన ప్రధాని మోదీ చిరుకోపం ప్రదర్శించారు. “పవన్, వాళ్లను కిందికి దించమని పోలీసులకు చెప్పు” అని సూచించారు. 

“లైట్ టవర్స్ నుంచి దిగిపోండి… మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. ఆ లైట్ టవర్లకు కరెంటు  ఉంటుంది… కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నా. ప్రమాదాలు జరిగితే ఎంతో బాధగా ఉంటుంది” అని మోదీ పేర్కొన్నారు. మోదీ కొంచెం గట్టిగానే చెప్పడంతో లైట్ టవర్లు ఎక్కినవారంతా వెంటనే దిగిపోయారు. అనంతరం పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.