హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా చూసే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూల గురించి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ నాణ్యత పడిపోవడంపై అనేక ఫిర్యుదులు మనం వింటూనే ఉన్నామని ఆయన చెప్పారు. దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 మార్చి / ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుద్ధరిస్తామని తెలిపారు. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.