మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
బిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. రామ్‌చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది.
