జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల కార్యరంగంలోకి దిగారు. తన ప్రచార రథం వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. అంతేకాదు ప్రచారంతో దూసుకుపోతూనే ఆధ్యాత్మిక దీక్షను కూడా కొనసాగిస్తున్నారు పవన్ కల్యాన్. నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్షను ఆచరించనున్నారు. మొదట ఉపవాస దీక్షను నవరాత్రులు చివరి మూడు రోజులు ఆచరించాలనుకున్న పవన్.. ఈరోజు నుంచే దీక్షను ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగించనున్నారు జనసేనాని. వచ్చే నెల గురుపౌర్ణమి నాటినుంచి చాతుర్మాస దీక్ష కూడా ఎప్పటిలాగే ఆచరించనున్నారు పవన్ కళ్యాణ్. అందువల్ల ఈ ఉపవాస దీక్షను కార్తీక మాసాంతం వరకు కొనసాగించనున్నాట్లుగా తెలిపారు. దీక్షా కాలంలో పాలు, ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకొనున్నారు పవన్. లోక కల్యాణార్ధం ఇటీవల మంగళగిరిలో మహాయాగం నిర్వహించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారు