ఇటీవల కేటీఆర్ పర్యటన వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి రగిల్చింది. కేటీఆర్ పర్యటన తర్వాత కేటీఆర్ నుద్దేశించి కొండ మురళి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.దమ్ముంటే వచ్చి పరకాలలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

కొండా మురళి, కొండా సురేఖ భాష మార్చుకోవాలని హితవు పలికారు. కొండా మురళి కుమార్తె కూడా వయసు నుంచి మాట్లాడుతుందని మండిపడ్డారు. పరకాలలో గెలవలేక వరంగల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఉరికించి కొట్టారని, అదే మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కొండా మురళి అసలు ధర్మారెడ్డికి మా ఇంటి గేటు తెలుసా అంటూ ప్రశ్నించారు. నీ అంతు తేల్చడానికే వచ్చాను నేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కొండా సురేఖ, తన బిడ్డ భాష బాగోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు