విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రౌడీషీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ను కిడ్నాప్ చేయడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.

డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని, విశాఖ వదిలివెళ్లనని, రాజకీయాలకు ముడిపెట్టి వ్యాపారాలను ఎత్తి చూపుతున్నారన్నారు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు చిత్రహింసలకు గురిచేశారని, వారిస్థానంలో తానుంటే చచ్చిపోవడం లేదంటే చంపడమో చేసేవాణ్ని అన్నారు.

Previous articleకొండా మురళి వర్సెస్ చల్లా ధర్మారెడ్డి రాజకీయం!
Next article‘గుంటూరు కారం’.. గురూజీపై బండ్ల గ‌ణేష్ సెటైర్