ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయం పాలైంది. వై నాట్ 175 అన్న జగన్ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని జగన్ కు సంబందించిన లోటస్ పాండ్ లో అక్రమ కట్టడాలను జి ఎచ్ ఎం సి అధికారులు కూల్చేయగ ఇప్పుడు మరో వివాదం మొదలైంది. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబల్ లైన్ రహదారి వివాదాస్పదంగా మారింది. అయితే ప్రజల సొమ్ముతో నిర్మించిన డబల్ లైన్ రోడ్ ప్రవైట్ రోడ్డు గా మార్చటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జగన్ భద్రతా సిబ్బంది ఈ మార్గంలో ఎవరిని అనుమతించకపోవటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికే జగన్ పై ప్రజాధనం తో నిర్మాణాలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి .. ఈ నేపథ్యంలో జగన్ వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేయనున్నట్టు సమాచారం. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ ప్రజాక్షేమం కన్నా తన విలాసాలకే ప్రధాన్యతను ఇచ్చినట్టు కొందరు అంటున్నారు. కాగా ఎన్నికలో వైసీపీ దారుణ పరాజయం తర్వాత కూడా ఆయనలో మార్పు రాకపోవటం విచిత్రం. ప్రజల సొమ్మును తన సొంత సొమ్ములా జగన్ వ్యవహరిస్తున్నారని కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ క్యాంపు కార్యాలయం వద్ద నిర్మించిన డబల్ లైన్ రోడ్డును తన సొంత రోడ్డుల మార్చుకుని ఆ వైపు ఏ ఒక్కరిని కూడా అనుమతించటం లేదు. అయితే క్యాంపు కార్యాలయం పరిధిలోని ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 5 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రకాశం బ్యారేజీ నుండి రేవేంద్ర పాడు డబుల్ లేన్ రోడ్డు కోసం అప్పట్లో 5కోట్ల రూపాయల నిధులు మంజూరయినట్టు వార్తలు వచ్చాయి. . కానీ, ఆ నిధులతో జగన్‌ క్యాంపు కార్యాలయ పరిధిలో ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. ఇప్పుడు జగన్‌ సీఎం హోదాలో లేకపోయినా.. ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపైకి ప్రజలనెవరినీ జగన్ భద్రతా సిబ్బంది అనుమతించక పోవటంతో, స్థానిక ప్రజల నుంచి దీనిపై ఫిర్యాదులు చేయటంతో .రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్, అందులోనే రాజకీయ కార్యకలాపాలు సాగించిన విషయం తెలిసిందే. . జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసు కోసం ప్రభుత్వ డబ్బుతో కోట్లాది రూపాయల ఫర్నిచర్, ఇతర సామాగ్రి కొనుగోలు చేశారు. భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై దాదాపు 20 అడుగుల ఎత్తున నిర్మించిన ఇనుప ఫెన్సింగ్ కోసమే కోట్ల రూపాయలమేర ప్రజాధనం ఖర్చు చేయగా సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, UPS వ్యవస్థల ఏర్పాటు కోసం దాదాపు 3కోట్ల 63 లక్షల వరకు వెచ్చించినట్టు తెలుస్తోంది. .ఇప్పుడు జగన్‌ రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఫర్నీచర్‌ వినియోగించటం నైతికత ఎలా అవుతుందనే..విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశగా నిబంధనల అతిక్రమణపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశాలున్నట్టు సమాచారం .