తాడేపల్లిగూడెంలో నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం చేరుకున్నారు. అగ్రనేతల రాకతో జెండా సభ వద్ద కోలాహలం మిన్నంటింది.

తాడేపల్లిగూడెంలో ఈ సాయంత్రం తెలుగు జన విజయకేతనం నినాదంతో సభ నిర్వహిస్తున్నారు. ఇటీవల 99 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలు ప్రకటించిన అనంతరం ఉమ్మడిగా చేపట్టిన తొలి సభ ఇదే. టీడీపీ-జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ అనే పేరు ఖరారు చేశారు. ఈ సభ ద్వారా ఇరు పార్టీల శ్రేణులకు చంద్రబాబు, పవన్ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.