తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన జెండా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు తమతో చేయి కలపాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం విజన్-2029 డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు.

“టీడీపీ, జనసేన పార్టీలు కలిశాక జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఏపీ దశ దిశ మార్చబోతోంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం పాల్జేసిన నేతలను తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లిగూడెం సభను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. ఈ సభ స్పందన శుభసూచకం… రాష్ట్రానికి త్వరలో నవోదయం.