టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం తెలిపారు. పవర్ స్టార్ పవన్ అనగానే సభలో ఉన్న జనసైనికులు కేరింతలు కొట్టారు.

అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య పునరుద్ఘాటించారు.