ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్, మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, కానీ ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? అని నిలదీశారు.