జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ ను ఐక్య‌రాజ్య స‌మితి ఆహ్వానించింది. ఆ ఆహ్వానం మేరకు ఈ నెల 22న జ‌రిగే స‌ద‌స్సులో జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. దీంతో ప‌వ‌న్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ బ‌య‌ల్దేరి వెళ్లనున్నార‌ని సమాచారం కాగా, దేశం త‌ర‌ఫున పాటుప‌డే న‌లుగురికి మాత్ర‌మే ఐక్య‌రాజ్య స‌మితిలో ప్రసంగించే అవ‌కాశం ద‌క్కుతుంది. అలంటి అరుదైన అవ‌కాశాన్ని జనసేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ద‌క్కించుకోవటం విశేషం. నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసే నేత‌ల‌కు మాత్ర‌మే ఇలాంటి అరుదైన అవకాశం ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. తను అన్నీ వదిలేసి నిస్వార్థంగా ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. నిజానికి స్టార్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ వందల కోట్లు సంపాదించొచ్చు . కానీ అన్ని పక్కన పెట్టి , ఏసీ రూములకు దూరంగా ఎండలో ఆయన ప్రచారం సాగిస్తూ , ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ , ప్రజలకు అండగా నిలబతానని చెపుతూ ముందుకెళ్లటం ఆయన నిస్వార్థ గుణానికి నిదర్శనం. అప్పుడప్పుడు తీవ్ర జ్వరంతో ఆరోగ్యం సహకరించుకున్నా లెక్క చేయకుండా ప్రజాసేవకై అడుగేస్తున్నారు. అన్యాయాన్ని అక్రమార్కులను అంతం చేసి స్వచ్ఛమైన , నీతివంతమైన పాలన తీసుకువచ్చేoదుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గోడకు కొట్టి బంతి ఎంత వేగంగా వెనకకు వస్తుందో గత ఎన్నికల్లో ఓడినా ఏ మాత్రం అధైర్యపడకుండా అంతే వేగంగా వచ్చి పిఠాపురం నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ఎ న్నికల బరిలో నిలిచారు. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు కేటాయించిన సీట్ల‌లో త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ప్రచార సభలలో పాల్గొంటూ తమ నాయకులు ,కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు . పిఠాపురంలో తన గెలుపుకు దయితం పవన్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.