తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న జెండా సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు.

పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పరస్పరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు. చంద్రబాబు జనసేన జెండా చేతబట్టగా, పవన్ టీడీపీ జెండా అందుకుని ఊపారు. ఈ సందర్భంగా సభా వేదికపై పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన నేతలతో చంద్రబాబు, పవన్ కరచాలనం చేశారు. చేయి చేయి కలిపి పైకెత్తి టీడీపీ, జనసేన ఐక్యతను చాటారు.