తాడేపల్లిగూడెం జెండా సభకు టీడీపీ, జనసేనే నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ… వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలని అభిలషించారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు.జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ-జనసేన శ్రేణుల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని… టీడీపీ-జనసేన కలయికను స్వాగతించి రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు.