టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన రేపు పూచీకత్తును సమర్పించనున్నారు. మరోవైపు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ కు కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.