శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో దసరా పులి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఓ ఊరేగింపులో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తప్పెట్ల మోతకు ఉత్సాహంగా కాలు కదిపారు. కొందరు కళాకారులు పులివేషాలు వేసుకుని డ్యాన్స్ చేస్తుండగా, ఎమ్మెల్యే కూడా హుషారుగా రంగంలోకి దిగారు. తప్పెట్ల మోతకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. పులి వేషం ఒక్కటే తక్కువ గానీ, ఆయన కళాకారులకు తీసిపోని రీతిలో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.