సిరిసిల్లలో రాణిరుద్రమ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని, సిరిసిల్లలో సామంతరాజుల పాలన నడుస్తోందని విమర్శించారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతిపరులు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేటీఆర్… నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము మీ అయ్యకు ఉందా? అని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే గుణం ముఖ్యమని బీసీలను అవమానిస్తావా? అని దుయ్యబట్టారు. సిరిసిల్లకు ఆయన చేసిందేమీ లేదన్నారు. చినుకులు పడితే మునిగిపోయే సిరిసిల్ల అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ తథ్యమని, రాణిరుద్రమ గెలుస్తారన్నారు.