కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను బీసీల్లో చేర్చుతామని పేర్కొన్నారని, దీంతో ఇటు బీసీలకు, అటు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. ఈ మైనార్టీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ బీజేపీ ఐడియాలజీతో మైనార్టీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుగా ఉందన్నారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌‌కు తప్పుడు వాగ్దానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలాసార్లు ఇలా చేసిందన్నారు.