సినిమాలకు దూరంగా ఉన్న ప్రముఖ సినీ నటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటోంది. తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. తన వైవాహిక జీవితం గురించి ఆమె మాట్లాడుతూ… తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని సమంత తెలిపింది. తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు ఇదేనని చెప్పింది. ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని… ఎందుకంటే తన గత జీవిత భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడే మనం విలువైన పాఠాలను నేర్చుకోగలమని తెలిపింది. మరోవైపు గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… వరుస ఫ్లాప్ లు, ఆరోగ్య సమస్యలు, విడాకులు ఒకేసారి చుట్టుముట్టడంతో కుంగిపోయానని చెప్పింది. ఓవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే… మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని తెలిపింది. సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె నిర్మాతగా మారింది. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది.