ప్రస్తుతం టాలీవుడ్ లో యువ నటి శ్రీలీల హవా నడుస్తోంది. యువ హీరోలు, బడాస్టార్లు, సీనియర్లతో వరస సినిమాలతో బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనల్ లో వస్తున్న ‘గుంటూరు కారం’లోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ పూజా హెగ్డే కాగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. సినిమాలో హీరో మహేశ్ మరదలి పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.

బుధ‌వారం చిత్ర బృందం ఆమెకు స‌ర్‌ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.  శ్రీలీల పుట్టిన‌ రోజు కావడంతో సినిమాలో ఆమె సంద‌ర్భంగా ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో పూర్తిగా లంగా వోణిలో శ్రీలీల పల్లెటూరి సంప్రదాయ అమ్మాయిలా కనిపించింది. కాలి వేళ్ల‌కు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉన్న ఫొటోలో అందంగా ఉంది. కాగా, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.