ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పలకరించనుంది. ఆ రొమాంటిక్ ఎంటర్టైనర్ పేరే ‘తులసీవనం’. అక్షయ్ .. ఐశ్వర్య .. వెంకటేశ్ కాకుమాను .. విష్ణు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి అనిల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్ ఈ సిరీస్ ను సమర్పిస్తున్నాడు.

ఈ సిరీస్ ను ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ఈటీవీ విన్ నుంచి వచ్చేసింది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఫ్రెండ్షిప్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, స్ట్రీట్ క్రికెట్ నేపథ్యాన్ని కూడా తోడుగా చేసుకుని ఈ సిరీస్ నడుస్తుంది. స్మరణ్ అందించిన సంగీతం ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.