త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో  రూపొందిన ‘గుంటూరు కారం’ రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ నిర్మాణం .. పాటల చిత్రీకరణ .. యాక్షన్ సీన్స్ షూట్ కి సంబంధించిన విషయాలు మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నాయి.ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికలుగా శ్రీలీల – మీనాక్షి చౌదరి కనువిందు చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. సునీల్ .. జయరామ్ తదితరులు నటించారు. వాళ్లంతా కాంబినేషన్స్ సీన్స్ ను ఎంజాయ్ చేస్తూ చేయడం మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనే విషయం అర్థమవుతోంది.