భారత చలనచిత్ర రంగంలో అతిలోక సుందరి అనగానే గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఆ రేంజ్‌లో ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి. అలాంటి అతిలోకసుందరి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే అంటూ ఫ్యాన్స్ చెబుతుంటారు. అందుకే ఆమె బయోపిక్ తీయాలంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు చాలా సార్లు డిమాండ్ చేశారు. అయితే తాజాగా దీనిపై ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాను నిర్మించిన మైదాన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. “నా భార్య చాలా ప్రైవేట్‌ పర్సన్‌ అని , ఆమె వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకునేందుకు, బయటకు చెప్పడానికి అసలు ఇష్టపడేది కాదని , తన జీవితమంతా అలానే ఉందని , అలాంటిది ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి ఎలా అంగీకరిస్తానని, తాను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వనంటూ .” బోనీ కపూర్‌ తేల్చి చెప్పారు. ఇక ఈ సందర్భంగా శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు బోనీ. “ఇంగ్లీష్‌ వింగ్లీష్‌” చిత్రాన్ని మొదట ఐశ్వర్యా రాయ్‌తో తీయాలనుకున్నారు. అయితే ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా అని .. ఆమె ఇంగ్లీషు రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని నేనే అడ్డు చెప్పానని బోనికపూర్ అన్నారు . ఆ పాత్రకు శ్రీదేవి సరిగ్గా సరిపోతుందని చెప్పడంతో ఆ దర్శకనిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయిందంటూ బోనీ చెప్పారు.