రాజకీయాల్లో ఒకరి పై ఒకరు మాటలతో దూషించుకోవటం సహజం .. కానీ అది నేటి రాజకీయాల్లో ప్రత్యక్షంగా దాడులు చేసే స్థాయికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే
టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి అభ్యర్దే బొజ్జల సుధీర్‌రెడ్డి .. ప్రస్తుతం నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వైసీపీ సానుభూతిపరుడు మహేశ్‌కుమార్‌గా గుర్తించారు. శ్రీకాళహస్తిలోని ఐదో వార్డు బహుదూరుపేటలో సుధీర్‌రెడ్డి ప్రచారంలో ఉండగా ఆయనతో సెల్పీ దిగాలని ఉందని టీడీపీ శ్రేణులను మహేశ్‌కుమార్ అడిగాడు. అతడు మద్యం తాగి ఉండడంతో అనుమానించి పరిశీలించగా చేతిలో కత్తి ఉండడం గుర్తించి వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సుధీర్‌రెడ్డిని హత్య చేయాలనే ఆ వ్యక్తి వచ్చాడంటూ టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మాత్రం బహుదూరుపేటలోని జాతరకు వచ్చానని చెబుతున్నాడని , మరి కత్తి దేనికోసం అని అడగగా తన భద్రత కోసం అని ఆ వ్యక్తి చెప్పడం అనుమానాలకు తావిస్తోందని , అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.