మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ జోడీ ఇటలీలోని ప్రఖ్యాత టూరిజం స్పాట్ టస్కనీలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా టస్కనీ చేరుకుంది. రామ్ చరణ్ అత్తామామలు కూడా టస్కనీ రావడంతో ఇక్కడ పెళ్లి కోలాహలం మామూలుగా లేదు. కొణిదెల, కామినేని కుటుంబాలు ఒక్కచోట కలవడంతో ఓ రేంజిలో జోష్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, శ్రీజ, శోభనా కామినేని, అనిల్ కామినేని తదితరులు టస్కనీ ప్రకృతిని హాయిగా ఆస్వాదిస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్-అన్నా లెజ్నెవా దంపతులు కూడా టస్కనీ వెళ్లడం తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యామిలీ వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీ బయల్దేరింది.