తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు టికెట్ ను కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయించింది. ఈ పరిణామంతో నాగం మనస్తాపానికి గురైనట్టు సమాచారం. పార్టీ  నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన నిరసన గళం వినిపిస్తున్నారు. మద్దతుదారులతో చర్చించిన ఆయన కాంగ్రెస్ ను వీడుతున్నట్టు తాజాగా ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్టు వెల్లడించారు.