భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మధ్య చాయ్ చర్చ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఈ భేటీలో మోదీ, బిల్‌గేట్స్‌ చాలా అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు . తాను ఉదయాన్నే.. తెల్లవారక ముందే నిద్రలేస్తాననీ, యోగా చేస్తాననీ చెప్పారు. ఇక టీ గురించి మాట్లాడుతూ తాను కధా టీ తాగుతానని, ఆ టీ తన ఆరోగ్యాన్ని పెంచుతోంది మోదీ అన్నారు. ఇండియాలోకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కథా టీని తాగమని ప్రజలకు సూచించింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తాను కధా పానీయం తాగుతానని దేశ ప్రజలకు చెప్పారు. కధా అనేది ఆయుర్వేద మూలికలతో తయారయ్యే టీ లాంటి ఔషధ పానీయాన్ని కధా అంటారు . హిమాలయాల్లోని మూలికలు, సుగంద ధ్రవ్యాలతో దీన్ని తయారుచేస్తారు . ఇందులో దాల్చిన చెక్క, తులసి ఆకులు, శొంఠి, నల్ల మిరియాలు, యాలకులు, ఎండుద్రాక్ష ఉంటాయి. వీటన్నింటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి .అందువల్ల వ్యాధుల్ని నయం చేసే శక్తి ఈ టీ లో ఉంది. అందుకే రోజూ దీన్ని ఒక్కసారైనా తాగితే… రకరకాల వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతారు . ఈ పానీయం తాగితే… ఇన్ఫెక్షన్లు రావని , జీర్ణక్రియ మెరుగవుతుందని . బాడీలో విష వ్యర్థాలు బయటకు పోతాయని నిపుణులు సూచించారు.