టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాయుడుపేటలో నేడు జనసునామీ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు. 

శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ వెయ్యి తప్పులు చేశాడని, మీరు క్షమిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే, అందరినీ నమ్మించి మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. 

నాయుడుపేట ఎస్సీ నియోజకవర్గం అని, తాను రోడ్డు  మార్గం ద్వారా వస్తుంటే, ప్రజలంతా జెండాలు చేతబూని చంద్రన్నా మీ వెంటే ఉంటాం అని నినదించారని వెల్లడించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా… పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా… పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని పేర్కొన్నారు.